మాయాబజార్(2006)

చిత్రం: మాయా బజార్ (2006)          
గానం: గాయత్రి          
రచన: వేటూరి         
సంగీతం: కె. ఎం.రాధా క్రిష్ణన్
కనివిని ఎరుగని ఈ కల నిజమని పలికెను కోకిల
ప్రతి ఒక అణువున నేడిలా అవనికి వచ్చెను నవకళ
అలరులు కురిసిన ఈ ఇల మెరిసెను నూతన వధువులా
తొణికిన తూరుపు వెలుగిలా పుడమికి అలరెను మేఖల

చెదిరే అలల ఝంకారాల ఝరులే జలకన్యకురులా
హిమతీరాల సుమగంధాల తెరలే వలపుతిమ్మెరలా
మధుమాసాల ఋతురాగాల జతులే వనరాణి శ్రుతులా
అరవిందాల మకరందాల ఋతువే చిలిపితుమ్మెదలా
విరిసిన హరివిల్లే రంగులవిరిజల్లై చిలకరించె భూమిపైన తొలకరులే

శిఖి పించాల సఖిలా నేడు మనసే తొలిపురులు విడగా
వరలాస్యాల వైభోగాల వయసే తెగతుళ్ళిపడగా
పలు అందాల జగతీ చూసి పలుకే మరిమూగవోగా
అతిలోకాల సౌందర్యాల లయలే ఇలనల్లుకోగా
తన్మయమై నేనే ధన్యతనే పొందే తరుణమేదో ముందు నిలిపె క్షణములనే

కనివిని ఎరుగని ఈ కల నిజమని పలికెను కోకిల
ప్రతి ఒక అణువున నేడిలా అవనికి వచ్చెను నవకళ
అలరులు కురిసిన ఈ ఇల మెరిసెను నూతన వధువులా
తొణికిన తూరుపు వెలుగిలా పుడమికి అలరెను మేఖల

For song download

http://www.mediafire.com/?ywxyyhjuium