పున్నమి నాగు(1980)

సినిమా:- పున్నమి నాగు
సంగీతం:- చక్రవర్తి
రచన:
గానం:- బాలు

పున్నమి రాత్రీ..పువ్వుల రాత్రీ
వెల్లువ నాలో..పొంగిన వెన్నెల రాత్రీ

మగువ సోకులే మొగలి రేకులై
మత్తుగ పిలిచే రాత్రి
మరుడు నరుడిపై మల్లెలు చల్లి
మైమరపించే రాత్రి
ఈ వెన్నెలలో..ఆ వేదనలో
నాలో వయసుకు నవ రాత్రి
కలగా మిగిలే కడరాత్రి
పున్నమి రాత్రీ..

కోడెనాగుకై కొదమనాగిని
కన్నులు మూసే రాత్రి
కామదీక్షలో కన్నెలందరు
మోక్షం పొందే రాత్రి
నా కౌగిలిలో..ఈ రాగినితో
తొలకరి వలపుల తొలి రాత్రి
ఆఖరి పిలుపుల తుది రాత్రి
పున్నమి రాత్రీ..పువ్వుల రాత్రీ
వెల్లువ నాలో..పొంగిన వెన్నెల రాత్రీ

 

ప్రకటనలు

శుభలేఖ

చిత్రం: శుభలేఖ(1982)

రచన: 

సంగీతం: ఇళయరాజా 

గానం: S.P.  బాల సుబ్రహ్మణ్యం, P. సుశీల

రాగాల పల్లకిలో కొయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా

నా ఉద్యోగం పోయిందండి

తెలుసు అందుకే రాలేదు ఈ వేళా కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా

రాగాల పల్లకిలో కొయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా

 రాలేదుఈ వేళా కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా

 రాగాల పల్లకిలో కొయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా ఎందుకమ్మా

పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ మూగ తీగ పలికించే వీణలమ్మకీ

పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ మూగ తీగ పలికించే వీణలమ్మకీ

బహుషా అది తెలుసో ఏమో  ఉహు హూ…. బహుషా అది తెలుసో ఏమో

జాణ కోయిలా రాలేదు ఈ తోటకీ ఈ వేళ 

రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళా అందుకేనా అందుకేనా

 

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ

కంటి పాప జాలికి లాలీ పాడినప్పుడూ

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ

కంటి పాప జాలికి లాలీ పాడినప్పుడూ

బహుషా తను ఎందుకనేమో లలలాల

బహుషా తను ఎందుకనేమో గడుసు కోయిలా

రాలేదు ఈ తోటకి ఈ వేళా 

రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదా నీవుంటే కూనలమ్మా

రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదా నీవుంటే కూనలమ్మా 

సుస్వాగతం

చిత్రం: సుస్వాగతం(1997)
రచన:
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
గానం: ఎస్. పి. బాలు
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందొ తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం

చరణం1:

ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండె బావిలో వున్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదర వుంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం

చరణం2:

సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకుని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందొ తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

మేఘ సందేశం(1982)

చిత్రం: మేఘ సందేశం(1982)
రచన:
సంగీతం: రమేష్ నాయుడు
గానం: కె. జె. ఏసుదాసు
పల్లవి:

ఆకాశ దేశాన  ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం
చరణం:1

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదనా  విరహ వేదనా
ఆకాశ దేశాన  ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
చరణం:2

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్ప జలదారాలతో
ఆ..ఆ..ఆ..యా
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణ యాతనా
ఆకాశ దేశాన  ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

ఆకలి రాజ్యం (1981)

చిత్రం: ఆకలి రాజ్యం (1981)
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్
గానం: బాలసుబ్రహ్మణ్యం

హె హె హె హె హె హె హే హేహె
రు రు రు రు రూ రు రూ రూరు
సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదె బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదె బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ
మన భూమి వేద భూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ
మన భూమి వేద భూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా
డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని
డిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించె భావి పౌరులం బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదె బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా
గంగలొ మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదె బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా
చదవెయ్య సీటు లేదు చదివొస్తె పనీ లేదు
అన్నమో రామచంద్ర అంటె పెట్టేదిక్కేలేదు
దేవుడిదె భారమని పెంపు చేయర బ్రదర్

సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదె బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడ పెళ్ళిలాంటిదె బ్రదర్

సిరివెన్నెల (1986)

చిత్రం: సిరివెన్నెల (1986)
రచన: సీతా రామ శాస్త్రి
సంగీతం: కె. వి. మహదేవన్
గానం: బాలు,

ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు
ననుగన్న నా వాళ్ళు ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు

ఈ గాలి ఈ నేల

చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తేలిశాక వచ్చేను నా వంక
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక
నా రాక తేలిశాక వచ్చేను నా వంక
ఎన్నాల్లో గడిచాక ఇన్నాల్లకు కలిసాక
ఎన్నాల్లో గడిచాక ఇన్నాల్లకు కలిసాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాక
ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగి దాక
ఎగసేను నింగి దాక

ఈ గాలి ఈ నేల ఈ వూరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి ఈ నేల

ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను

కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చినుకు కాంతి చినుకులై
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చినుకు కాంతి చినుకులై
గగన గళమునుంది అమర గానవాహిని …ఆఆ…..
గగన గళమునుండి అమర గానవాహిని
జాలువారుతోంది ఇల అమృతవర్షిణీ అమృతవర్షిణి అమృతవర్షిణి
ఈ స్వాతి వానలో నా ఆత్మ స్నానమాడే
మురళిలో నా హృదయమే స్వరములుగా మారే
అహ్హాహా

ఈ గాలి ఈ నేల ఈ వూరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ..ఊ.. నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి ఈ నేల

స్వయంవరం (1982)

చిత్రం: స్వయంవరం (1982)
రచన:దాసరి
సంగీతం: సత్యం
గానం: కె. జె. ఏసుదాసు

పల్లవి:

గాలి వానలో వాన నీటిలో
గాలి వానలొ వాన నీటిలొ పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఒహొహో హో హో హో…..

చరనం1:

ఇటు హోరు గాలి అని తెలుసూ
అటు వరద పొంగు అని తెలుసూ
ఇటు హోరు గాలి అని తెలుసూ
అటు వరద పొంగు అని తెలుసూ
హోరు గాలిలో వరద పొంగులో సాగలేనని తెలుసూ
అది జోరు వాన అని తెలుసూ
ఇవి నీటి సుడులని తెలుసూ
అది జోరు వాన అని తెలుసూ
ఇవి నీటి సుడులని తెలుసూ
జోరు వానలో నీటి సుడులలో
ఇవి నీటి సుడులని తెలుసూ
జోరు వానలో నీటి సుడులలో
మునక తప్పదని తెలుసూ
అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఒహొహో హో హో హో…

చరనం2:

ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలగాటం
ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలగాటం
ఆశా జారినా వెలుగు తొలిగినా
ఆగదు జీవిత పోరాటం
ఇది మనిషీ మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళీ చెలగాటం
ఇది మనిషీ మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళీ చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై
బ్రతుకుతున్నదొక శవం
అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం తెలియదు పాపం
ఒహొహో హో హో హో…