దేవదాసు(1953)

 

చిత్రం:దేవదాసు(1953) 
రచన:సముద్రాల Sr.
సంగీతం:C.R.సుబ్బురామన్
గానం: ఘంటసాల, రాణి


అతడు:  చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదూ (2)
             ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే (2)
             మిగిలిందీ నీవేనే
             చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదూ

ఆమె:    చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే (2)
            చేరదీసి సేవజేసే తీరు కరువాయే (2)
            నీ దారే వేరాయే
            చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే

అతడు:  మరపు రాని బాధకన్నా మధురమే లేదూ (2)
             గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదూ (2)
             అందరాని పొందుకన్నా అందమే లేదూ
            ఆనందమే లేదూ
            చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదూ

ఆమె:   వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే (2)
           రగిలి పొగలౌ కుండలైనా పగిలి జారేనే (2)
           దారి లేని బాధతో నేనారిపోయేనా
           కథ తీరిపోయేనా
           చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
అతడు:   ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే
              మిగిలిందీ నీ వే నే

 

For song download

http://www.mediafire.com/?zgmtj2y4tng